Stock Market: లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు... 23 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. గురువారం సెషన్లో భారీగా నష్టపోయి ఈరోజు కోలుకున్నాయి. కనిష్టాల వద్ద మధుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9.28 గంటల సమయంలో ట్రెండింగ్ లో సెన్సెక్స్ 286.43 పాయింట్లు పెరిగి 79,329 వద్ద మొదలైంది. నిఫ్టీ 97.45 పాయింట్లు పెరిగి 24,013 వద్ద కొనసాగుతుంది. డాలర్ తో రూపాయి మార్గం విలువ 84.49గా ఉంది.